![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ పదోవారం వీకెండ్ సండే ఫన్ డే అంటు నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరు కూడా అమ్మాయిలు అబ్బాయిల గెటప్ లో.. అబ్బాయిలు అమ్మాయిల గెటప్ లో వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అవినాష్, తేజల గెటప్ చూసి నాగార్జున అవాక్కయ్యాడు.
ఆ తర్వాత నాగార్జున హౌస్ లో జరిగిన మూమెంట్ లని ఒక్కొక్కరికి ఇస్తాడు. అవినాష్ ని పృథ్వీతో ఉన్నప్పుడు విష్ణు ఎలా ఉంటుందని ఇమిటేట్ చెయ్యమనగా.. అవినాష్ పర్ఫెక్ట్ గా చెస్తాడు. ఆ తర్వాత ప్రేరణ మెగా చీఫ్ అయ్యాక ఎలా బిహేవ్ చేస్తుందో చూపించాడు. విష్ణు, పృథ్వీలాగా, యష్మీని గౌతమ్ అక్క అని పిలిచిన సిచువేషన్ నిఖిల్ మధ్యలో ఎంటర్ అయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ తేజ్ తన 'మట్కా' మూవీ ప్రమోషన్ కి వస్తాడు. హౌస్ మేట్స్ గెటప్స్ చూసి నవ్వుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయిల గెటప్ లో ఉన్న అబ్బాయిలకి ఐటమ్ సాంగ్స్ అబ్బాయిల గెటప్ లో ఉన్న అమ్మాయిలకి బాయ్స్ మాస్ సాంగ్స్ చేస్తారు. వాటికి వరుజ్ తేజ్ మార్కులు ఇస్తాడు.
ఆ తర్వాత హౌస్ లో ఎవరు ఎలాంటి వారో ఒక్కక్కరుగా ఒక్కొక్క హాష్ టాగ్ ఇవ్వాలి ఇదంతా ఫన్నీగా జరుగుతుంది. రేషన్ తీసుకొని వచ్చేటప్పుడు హౌస్ మేట్స్ సరుకులు దొంగతనం చేసిన వీడియోని చూపించి ప్రైజ్ మనీ నుండి డబ్బులు కట్ చేస్తామని నాగార్జున అనగానే.. అందరు వద్దని రిక్వెస్ట్ చెయ్యడంతో మనీ కట్ చెయ్యరు. ఎలాగోలా సండే ఫండే ఫుల్ ఫన్నీ గా హౌస్ మేట్స్ కి బెస్ట్ మెమొరెబుల్ డే గా గడిచింది.
![]() |
![]() |